Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Eelaatidaa Yesu Prema

ఈలాటిదా యేసు ప్రేమ

Eelaatidaa Yesu Prema

Lyricist: Raavuri Rangaiah
Chorus
ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను
తూలనాడక తనదు జాలి చూపినదా‖ ఈలాటిదా ‖
Verse
ఎనలేని పాప కూపమున – నేను
తనికి మిణుకుచును నే దరి గానకుండన్
కనికరము పెంచి నాయందు – వేగ
గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె‖ ఈలాటిదా ‖
Verse
పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను
మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు
నను నీచుడని త్రోయలేక – తనదు
నెనరు నా కగుపరచి నీతి జూపించె‖ ఈలాటిదా ‖
Verse
నెమ్మి రవ్వంతైనా లేక – చింత
క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి
సమ్మతిని నను బ్రోవ దలచి – కరము
జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె‖ ఈలాటిదా ‖
Verse
పనికిమాలిన వాడనైన – నేను
కనపరచు నా దోష కపటవర్తనము
మనసు నుంచక తాపపడక యింత
ఘనమైన రక్షణ-మును నాకు చూపె‖ ఈలాటిదా ‖
Verse
నా కోర్కెలెల్ల సమయములన్ – క్రింది
లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్
చేకూర్చి ధృడము చిత్తమునన్ – శుభము
నా కొసంగె జీవింప నా రక్షకుండు‖ ఈలాటిదా ‖
Verse
శోధనలు నను చుట్టినప్పుడు – నీతి
బోధ నా మనసులో పుట్టించి పెంచి
బాధలెల్లను బాపి మాపి – యిట్టి
యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు‖ ఈలాటిదా ‖

Related Tags

SalvationGood FridayJesus LoveMercy