Chorus
ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి జూపినదా
ఈలాటిదా‖ ఈలాటిదా ‖
Verse
ఎనలేని పాపకూపమున నేను తనికి మినుకుచును నే దరిఁ గానకు
డన్ కనికరముఁ బెంచి నా యందు వేగఁ గొని పోవ నా మేలు కొర
కిందు వచ్చె‖ ఈలాటిదా ‖
Verse
పెనుగొన్న దుఃఖాబ్ధిలోన నేను మునిఁగి కుములుచు నేడు పునగుందు
నపుడు నను నీచుఁడని త్రోయలేక తనదు నెనరు నా కగుపరచి
నీతిఁజూపించె‖ ఈలాటిదా ‖
Verse
నెమ్మి రవ్వంతైన లేక చింత క్రమ్మిపొగలుచు నుండ గా నన్ను ఁ
జూచి సమ్మతిని ననుఁ బ్రోవఁ దలఁచి కరముఁ జాఁచి నా
చేయిబట్టి చక్కఁగా బిలిచె‖ ఈలాటిదా ‖
Verse
పనికిమాలిన వాఁడనైన నేను కనపరచు నాదోష కపటవర్తనము
మనసు నుంచక తాపపడక యింత ఘనమైన రక్షణ మును నాకుఁ జూపె
ఈలాటి‖ ఈలాటిదా ‖
Verse
నా కోర్కె లెల్ల సమయములన్ క్రింది లోక వాంఛల భ్రమసి
లొంగెడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ శుభము నా కొసంగె
జీవింప నా రక్షకుండు‖ ఈలాటిదా ‖
Verse
శోధనలు ననుఁ జుట్టినపుడు నీతి బోధ నా మనసులోఁ బుట్టించి
పెంచి బాధ లెల్లను బాపి మాపి యిట్టి యాదరణఁ జూపెనా యహహ
యేమందు‖ ఈలాటిదా ‖