Verse
ఈరోజు క్రొత్త వెలుగు
మన జీవితాలలో ఆ వెలుగు
ఆ వెలుగే యేసుక్రీస్తు‖ 2x ‖
మన కోసం పుట్టాడు
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడే నా యేసయ్యా
హో..నిత్యుడవగు తండ్రీ సమాధానకర్త
కరుణామూర్తి నా యేసయ్యా
Verse
నీ జననం బంధకాలకు
విమోచనా తరుణం‖ 2x ‖
పాపముల భయమునుండి
విడిపించిన ఇమ్మానుయేలు‖ 2x ఈరోజు ‖
Verse
నీ జననం లోకానికి రక్షణకు ఆధారం‖ 2x ‖
బలహీనులకు బలమైన
అనుగ్రహమే ఇమ్మానుయేలు‖ 2x ఈరోజు ‖
Verse
నీ జననం మానవాళికి
సంతోషం కలుగజేసెను‖ 2x ‖
భూ జనులకు వెలుగైన
ఆప్రభువే ఇమ్మానుయేలు‖ 2x ఈరోజు ‖