Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Eeyana Maata Vinudi Needu Eeyanae Naa Priya Kumaarudu

ఈయన మాట వినుడి నేడు ఈయనే నా ప్రియ కుమారుడు

Eeyana Maata Vinudi Needu Eeyanae Naa Priya Kumaarudu

Verse
ఈయన మాట వినుడి - నేడు - ఈయనే నా ప్రియ కుమారుడు
Verse
ఈయనే నా ప్రియ కుమారుడు - శాపముతీర్చెడు పాపరహితుడు
దైవకుమారుండీయనే
Verse
ఈయనమాట నిరాకరించెడివారు - తప్పించుకొనరు దైవదండనను
దహించబడుదు రెల్లప్పుడు
Verse
మహిమగల రాజు మాట నిచ్చెను - ఇహమందాయన మాటను దెల్ప
మహాసైన్యము లేచెను
Verse
పరలోక దేవుని దర్శనమునకు - స్థిరులై యుండెదము మరలక మనము
విధేయులై వికసింతుము
Verse
దాసుని స్వరూపమును దాల్చెను - మరణము పొందునంత విధేయుడై
రిక్తుడుగ మరణించెను
Verse
పరమందునుండు వారిలోగాని - భూమి యందును - భూమిక్రిందైన
పూజనీయుడీయనే
Verse
సర్వశక్తిగల ప్రభువునకు - స్తోత్రము ఘనత మహిమ ప్రభావము
నిత్యము కల్గును గాక

Related Tags

WorshipGospel