Verse 1
సంతోషం ఉత్సాహం కలసిన జయగీతం
యేసే మా రక్షకుడు ఇదే మా నినాదం - 2
Verse 2
చితికిన మాబ్రతుకును అతికినాడని
గతుకుల సుడిదారి నుండి లేపినాడని - 2
అధికమైన ప్రేమతో చేరదీసినాడని
తనరక్షణ కౌగిలిలో కాపాడుచున్నాడని ||మేమాయన ||
Verse 3
ధరను ప్రేమించిన నరరూప ధారుడని
నరులకై తనప్రాణం ధారపోసినాడని - 2
మృతినిగెల్చి తిరిగిలేచి విజయమిచ్చాడని
తనసంఘ వధువుకై తిరిగిరానున్నాడని ||మేమాయన ||
Verse 4
భూదిగంత వాసులార యేసువైపుచూడుడి
దీనమనస్సుతో ప్రభుని ఆశ్రయించుడి - 2
దురలవాట్ల కీడునుండి విమోచించును
మనఃశాంతి రోగశుద్ధి మోక్షప్రాప్తి నిచ్చును ||మేమాయన ||
Verse 5
మేమాయన ప్రజలం ఆయన మేపు గొర్రెలం
స్తుతిచేయుచు ప్రకటించుచు ప్రభుకృపలో సాగెదం