Verse 1
మా మంచి కాపరి మాయేసు ప్రభు
మమ్మెంచుకుంటివి నీ దివ్య సేవకై
అన్ని వేళలందు మాకు కన్న తండ్రివై
మాకు తోడుగా చేయి విడువక మమ్ము నడుపుము
Verse 2
నిన్నెరుగని జనులెందరో మా దేశములో ఉన్నారు
నిత్యము నీ కృపనే భుజించి బ్రతుకుతున్నారు
నీ రక్షణలేకయే నశించి పోవుచున్నారు
వారిని దర్శించే శక్తి నీయుము పాపకట్లనుండి విముక్తి నీయుము ||అన్ని ||
Verse 3
నలుదిక్కులమమ్ము పంపుము అనేకమైన ఆత్మలను ప్రోగుచేయుము
నమ్మిన నీ ప్రజలందరిలో ఉజ్జీవజ్వాల రగిలించుము
నలిగిన హృదయాలకు ఆదరణనీయుము
తిరుగుబాటు లోకములో స్థిరమనసులు దయచేయుము ||అన్ని ||