Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Egedanu Ne Cheredanu

ఏగెదను నే చేరెదను

Egedanu Ne Cheredanu

Verse
ఏగెదను నే చేరెదను
సీయోనును నే చూచెదను‖ 2x ‖
విశ్వాస కర్తయైన నా యేసూ‖ 2x ‖
నీ సముఖములో నే మురిసెదను
నీ కౌగిలిలో ఉప్పొంగెదను‖ 2x ‖
జీవ కిరీటమును నే పొందెదను‖ ఏగెదను ‖
Verse
భూదిగంతములకు నీ కాడిని – నే మోయుచున్నాను
యేసూ నీ యొద్దనే నాకు – విశ్రాంతి దొరుకును‖ 2x ‖
దినదినము నాలో నే చనిపోవుచున్నాను
అనుదినము నీలో బ్రతుకుచున్నాను‖ 2x ‖
అనుదినము నీలో బ్రతుకుచున్నాను‖ ఏగెదను ‖
Verse
నా ఆత్మీయ పోరాటములో దేవా – నీవే నా కేడెము
సదా నిన్నే నేను ధరియించి – సాగిపోవుచున్నాను‖ 2x ‖
మంచి పోరాటముతో నా పరుగును
కడముట్టించి జయమొందెదను‖ 2x ‖
విశ్వాసములో జయమొందెదను‖ ఏగెదను ‖

Related Tags

FaithHeavenPerseverance