Verse
పల్లవి : ఎగురుచున్నది విజయపతాకం
ఏసు రక్తమే మా జీవిత విజయం
రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును
సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
రక్తమే జయం - యేసు రక్తమే జయం
Verse
యేసుని నామము నుచ్చ రింపగానే
సాతాను సైన్యము వనుకుచున్నది
వ్యాదుల బలము నిర్మూలమైనది
జయమొండేది నామము నమ్మినప్పుడే‖ రక్తమే ‖
Verse
దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదరగోట్టిన
క్రీస్తుని సిలువను మనము అనుసరించేదం‖ రక్తమే ‖
Verse
మా ప్రేమ వైద్యుడ ప్రాణ నాధుడా
ప్రీతి తోడ నీ హస్తము చాపుము దేవా
నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్త పరచుము తండ్రి ఈ క్షణమందే‖ రక్తమే ‖