Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Egurutunnadhi Vijaya Pathakam Yesu Rakthame Maa Jeevitha Vijayam

ఎగురుతున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం

Egurutunnadhi Vijaya Pathakam Yesu Rakthame Maa Jeevitha Vijayam

Lyricist: Bro Yesanna
Verse
ఎగురుతున్నది విజయ పతాకం - యేసు రక్తమే మా జీవిత విజయం
రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును - సుఖ జీవనం చేయుటకు శక్తి నిచ్చును
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
రక్తమే జయం - యేసు రక్తమే జయం
Verse
యేసుని నామం నుచ్చరింపగనే - సాతాను సైన్యము వణుకుచున్నది
వ్యాధుల బలము నిర్మూలమైనది - జయం పొందెడి నామము నమ్మినప్పుడే‖ రక్తమే ‖
Verse
దెయ్యపు కార్యాలను గెలిచిన రక్తం - ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన - క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం‖ రక్తమే ‖
Verse
మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా - ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా
నీ పాద పద్మము పై చేరియున్న ప్రజలను - స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే‖ రక్తమే ‖

Related Tags

Blood Of JesusHealingVictory