Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ekkadekkado Putti

ఎక్కడెక్కడో పుట్టి

Ekkadekkado Putti

Lyricist: A R Stevenson
Verse
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి‖ 2x ‖
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
దేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం –‖ 2x ‖
Verse
ఒంటరి బ్రతుకును విడిచెదరు
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు‖ 2x ‖
పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలి
భార్య భర్తలు హత్తుకొనుటేమిటో‖ దేవుని ‖
Verse
గత కాల కీడంతా మరచెదరు
వీనులతో సంతసించెదరు‖ 2x ‖
పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో‖ దేవుని ‖
Verse
ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధి పొందెదరు‖ 2x ‖
పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో‖ దేవుని ‖

Related Tags

MarriageWedding