Verse
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
ఇది దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం
Verse
ఒంటరి బ్రతుకులు విడిచెదరు
ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు
పెళ్ళినాటినుండి తల్లితండ్రుల వదలి
భార్యభర్తలు హత్తుకొనుటేమిటో
Verse
గతకాలకీడంతా మరచెదరు
మేలులతో సంతసించెదరు
పెళ్ళినాటినుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో
Verse
ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధిపొందెదరు
పెళ్ళినాటినుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో