Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ekkado Manasu Vellipoyindi

ఎక్కడో మనసు వెళ్ళిపోయింది

Ekkado Manasu Vellipoyindi

Verse
ఎక్కడో మనసు వెళ్ళిపోయింది
ఏమిటో ఇటు రానే రానంది
ఆహాహా.. ఓహోహో…
నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది
ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది‖ 2x ‖
అక్కడే చిక్కుకుపోయానంటుంది
బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది‖ 2x ఎక్కడో ‖
జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది
తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది‖ 2x ‖
దేనికీ ఇక చోటే లేదంది
యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది‖ 2x ఎక్కడో ‖
ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది
ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది‖ 2x ‖
అక్కడే కరిగిపోతానంటుంది
ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది‖ 2x ఎక్కడో ‖

Related Tags

WorshipDevotionalJesus