Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. El Shama

ఎల్ షమా

El Shama

Lyricist: Jessy Paul
Verse
దేవా చెవియొగ్గుము.. దృష్టించుము.. నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియ్యుము.. బదులీయము.. నిన్నే వేడుచున్నాను
Verse
ప్రతి ఉదయం – నిను నమ్మి
ప్రతి రాత్రి – నిను వేడి
ప్రతి ఘడియ – నిను కోరి.. నహాళ్
Verse
ఆశతో వేచి ఉన్నా – నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచి ఉన్నా – నీవేగా నా ధైర్యం‖ 2x ‖
Chorus
ఎల్ షమా‖ 3x ‖
నా ప్రార్ధన వినువాడా‖ 2x ‖
Verse
ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను
నీ తట్టు నా కరముల్ నే చాపుచున్నాను‖ 2x ‖
ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు
పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము
ఆత్మ వర్షం కురిపించి నను బ్రతికించుము
నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు‖ ఎల్ షమా ‖
Verse
విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను
అడుగడుగు నా తోడై ఒడ్డుకు నను చేర్చవా‖ 2x ‖
యెహోవా నా దేవా నీవే నాకున్నది
బాధలో ఔషధం నీ ప్రేమే కదా‖ 2x ఎల్ షమా ‖
Verse
నీ శక్తియే విడిపించును
నీ హస్తమే లేవనెత్తును
నీ మాటయే నా బలము
నీ మార్గము పరిశుద్ధము‖ 2x ఎల్ షమా ‖

Related Tags

WorshipPrayer