Chorus
ఏల చింత యేల వంత యిచట నీకు క్రైస్తవ పాలకుండు యేసు నీదు
వంత లెల్ల నెరుఁగుఁగా‖ యేల ‖
Verse
తొల్లి నీ వొనర్చినట్టి దోష మెంతో జూడుమా కల్లగాదు యేసు క్రీస్తు
చెల్ల చెదరఁ జేసెఁగా‖ యేల ‖
Verse
నీకు కాలు జారినపుడు నిన్ను లేవనెత్తెఁగా నీ కలుషముఁ గడిగి వైచి
నిన్ను విమలుఁ జేసెఁగా‖ యేల ‖
Verse
నీకుఁ గల్గు వ్యాధు లన్నా నెవరు మీరఁ దీర్చెఁగా ప్రాకటముగ నీకు
సకల పదవు లిచ్చి ప్రోచెఁగా‖ యేల ‖
Verse
యేసు నిన్ను బాగు జేయ నిచట శ్రమలు బెట్టుగా వాసిగాను
శ్రమలయందు యేసు పజ్జఁజేరుమా‖ యేల ‖
Verse
నిన్ను తల్లడిల్లఁజేయు నీ విరోధు లందరిన్ మున్ను తండ్రి పగిదిఁ
దరిమి పన్నుగాను బ్రోచెఁగా‖ యేల ‖
Verse
సందియంబు లేల నీకు స్వర్గ నాధుఁ డుండఁగా అందమైన యీవులిచ్చి
యతఁడు నిన్ను ఁ బ్రోవగా‖ యేల ‖