Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Elaa Maruvagalanayyaa

ఎలా మరువగలనయ్యా

Elaa Maruvagalanayyaa

Lyricist: David Raj Roy
Verse
ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను
ఎలా విడువగలనయ్యా నీ సేవను‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x ఎలా మరువగలనయ్యా ‖
Verse
ఆత్మీయులే నన్ను ఆదరించలేదు
ప్రేమించువారే ప్రేమించలేదు‖ 2x ‖
ఆదరించావు ప్రేమించావు‖ 2x ‖
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు‖ 2x ఎలా మరువగలనయ్యా ‖
Verse
బంధువులే నన్ను ద్వేషించినారు
సొంత తల్లిదండ్రులే వెలివేసినారు‖ 2x ‖
చేరదీసావు సేదదీర్చావు‖ 2x ‖
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు‖ 2x ఎలా మరువగలనయ్యా ‖
Verse
అనాథగా నేను తిరుగుచున్నప్పుడు
ఆకలితో నేను అలమటించినప్పుడు‖ 2x ‖
ఆదరించావు ఆకలి తీర్చావు‖ 2x ‖
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు‖ 2x ఎలా మరువగలనయ్యా ‖

Related Tags

PraiseWorshipGratitude