Verse
ఏలాటివాఁడో కాని యీ యేసుని నేమని వివరింతుము గాలివాన
యేసుని గద్దింపునకుఁ చాల భయపడి నిలిచెను‖ ఏలాటి ‖
Verse
ముద్దు శిష్యులతోడను సముద్రపు టద్దరికి వెళ్లెను కొద్ది పడవనెక్కెను
ఇంతలోనె పెద్దగాలి రేగెను‖ ఏలాటి ‖
Verse
అల్లకల్లోలముగా సముద్రము అల్లలాడు నప్పుడు చల్లఁగ దోనె
వెనుక తలగడపైని మెల్లన నిదువోయెన్‖ ఏలాటి ‖
Verse
చింత లేదా యేమయ్యా బోధకుఁడా న శించిపోవుచున్నాము ఎంతో
వేదన పడితిమి కాపాడుమ టంచు శిష్యులు లేపిరి‖ ఏలాటి ‖
Verse
దిగ్గునఁ బ్రభువు లేచి యా గాలిని గద్దించిన వెంటనే తగ్గి నిమ్మళించెను
సమస్తము సద్దు ఉడిగిపోయెను‖ ఏలాటి ‖
Verse
ఏల భీతు లైతిరి యింతలోనే యెంత నమ్మిక లేదని యీలాగు
నోదార్చెను యేసు తన సొంత శిష్యుల నప్పుడు‖ ఏలాటి ‖