Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Elanti Vaadavaina

ఏలాంటి వాడవైనా

Elanti Vaadavaina

Verse
ఏలాంటి వాడవైనా
నీ వెంత ఘనుడవైనా
కనుమూసే కాలమొకరోజు
ఉన్నదని మరువబోకుమన్నా
Verse
నీకు మేడ మిద్దెలున్నా
నీవు ప్రభుని చూడలేవు
మోకాళ్లు వంచి నీవు మొఱలు బెట్టి
ప్రభునడిగి చూడమన్నా‖ ఏలాంటి ‖
Verse
నీకు ధనము బలగమున్నా
నీవు విర్రవీగకన్నా
ఆ ధనము కాస్తా తరిగిపోతే
దరికెవరు రారు సున్నా‖ ఏలాంటి ‖
Verse
పాపుల కొరకు ప్రభువు
కలువరిగిరిపైన
ఆసిల్వవేసి దుర్మారులంత
బహుబాధ పెట్టిరన్నా‖ ఏలాంటి ‖
Verse
నీవు పాపరోగివయ్యా
ప్రభు పిలుచుచున్నడయ్యా
ఆ ప్రభువునే పాదాలసాక్షిగా
ఎరిగి నడువుమయ్యా‖ ఏలాంటి ‖

Related Tags

RepentanceSalvationWarning