Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Elapaadanu Emicheppanu

ఎలాపాడనూ ఏమిచెప్పనూ

Elapaadanu Emicheppanu

Verse
ఎలాపాడనూ ఏమిచెప్పనూ
యేసుని ప్రేమ మంచితణమును
ఎన్నోరీతులా వివరించినా
మాటలు చాలవు ఆప్రేమకు
ఎందువెదకినా యేసునామమే
ఎటువెళ్లినా గానమే
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం
Verse
ఆకాశమంతా సిరాతో రాసినా
వర్ణించలేను యేసు ప్రేమనూ
విశ్వాంతరాలలో అన్వేషించినా
యేసయ్యకు సాటిలేరేవ్వరూ
ఊహకు అందనిది వర్ణించలేనిది
శాశ్వతమైనది నా యేసు ప్రేమ
ఎందువెదకినా యేసు నామమే
ఎటువెళ్లినా యేసు గానమే
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం
Verse
మనుషులూ చేసినా దేవుళ్ళు ఎందరో
నా యేసువలెనె ప్రాణము ఇవ్వలేరయ్యా
మరణపునీడలో పిలిచినా మనిషికి
విడుదల ఎవ్వరూ ఇవ్వలేరయ్యా
ప్రాణమిచ్చినా ప్రాణదాత యేసయ్య
జీవమిచ్చినా జీవదాత యేసయ్యా
ఎందువెదకినా యేసు నామమే
ఎటువెళ్లినా యేసు గానమే
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం

Related Tags

PraiseWorshipJesus