Chorus
ఎల్ల సోదరు లైక్యత వసియించుట యెంత మేలు మనోహరము‖ ఎల్ల ‖
Verse
ధరణిలో నహరోను తలనుండి దిగ జారు పరిమళ తైలంబు వలె
నద్ది తనరారు‖ ఎల్ల ‖
Verse
వెలయు సీయోను కొం డల పైకి దిగి వచ్చు నల హెర్మోను మంచు
వలె నద్ది చెల్వారు‖ ఎల్ల ‖
Verse
తరంతరం బాశీర్వా దము నిత్య జీవంబు స్థిరముగా నందుండ సెల
విడెను దేవుండు‖ ఎల్ల ‖
Verse
జనక తన యాత్మకును ఘన మహిమ మగుఁగాక మును పిప్పుడున్
యుగ ముల కగును గా కామేన్‖ ఎల్ల ‖