Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ella Vaelalandu Kashtakaalamandu Vallabhundaa Yesu Sthuthinthun

ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండా యేసు స్తుతింతున్

Ella Vaelalandu Kashtakaalamandu Vallabhundaa Yesu Sthuthinthun

Verse
ఎల్ల వేళలందు కష్టకాలమందు
వల్లభుండా యేసు స్తుతింతున్
ఎల్లను నీవే నా కెల్లెడల
వల్లపడదే వివరింప
Verse
విమోచకుడా విమోచన మీవే
రక్షకుడవు నా రక్షణ నీవే
Verse
సృష్టికర్తవు సహాయము నీవే
ఇష్టుడ వీవు త్రిత్వము నీవే
Verse
జ్ఞానము నీవే నా పానము నీవే
దానము నీవే నా గానము నీవే
Verse
జ్యోతియు నీవే నా నీతియు నీవే
ఆదియు నీవే నా అంతము నీవే
Verse
నిత్యుడ నీవే నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే నా నేత్రము నీవే
Verse
జీవము నీవే నా దేవుడ వీవే
పావన మీవే నా కావలి నీవే
Verse
కాంతియు నీవే నా శాంతియు నీవే
సంతస మీవే నా కంతయు నీవే

Related Tags

PraiseWorshipDevotional