Verse
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి
ప్రతి సమయములోను…
ప్రతి పరిస్థితిలోను ఆనందించండి‖ 2x ‖
యెహోవా చేసిన మేలుల కొరకై
ఎల్లప్పుడును ఆనందించండి‖ 2x ‖
ఆరాధించండి‖ ఎల్లప్పుడును ‖
Verse
పాపంబు తోడ చింతించుచుండ
నరునిగా ఈ భువిలో ఉదయించెగా
మన పాప భారం తన భుజమున మోసి
మనకై తన ప్రాణం అర్పించెగా‖ 2x ‖
ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి
ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే‖ ఎల్లప్పుడును ‖
Verse
విశ్వాసమునకు కలిగే పరీక్ష
ఓర్పును కలిగించే ఒక సాధనమై
శోధనకు నిలిచి సహించిన వేళ
జీవ కిరీటమును పొందెదము‖ 2x ‖
నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి
సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి‖ ఎల్లప్పుడును ‖
Verse
ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి
మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి
మనతో నివాసమును కలిగి యుండుటకు
త్వరలోనే రారాజుగా రానైయుండె‖ 2x ‖
శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి
సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి‖ ఎల్లప్పుడును ‖