Verse
ఎల్లవేళలందు – కష్టకాలమందు
వల్లభుండా యేసున్ స్తుతింతున్
ఎల్లను నీవే నా కెల్లెడల
వల్లపడదే వివరింపన్‖ 2x ‖
Verse
విమోచకుడా – విమోచన నీవే
రక్షకుడవు – నా రక్షణ నీవే‖ 2x ఎల్లవేళలందు ‖
Verse
సృష్టికర్తవు – సహాయము నీవే
ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే‖ 2x ఎల్లవేళలందు ‖
Verse
జ్ఞానము నీవే – నా పానము నీవే
దానము నీవే – నా గానము నీవే‖ 2x ఎల్లవేళలందు ‖
Verse
జ్యోతివి నీవే – నా నీతివి నీవే
ఆదియు నీవే – నా అంతము నీవే‖ 2x ఎల్లవేళలందు ‖
Verse
నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే – నా నేత్రము నీవే‖ 2x ఎల్లవేళలందు ‖
Verse
జీవము నీవే – నా దేవుడవు నీవే
పావన నీవే – నా కావలి నీవే‖ 2x ఎల్లవేళలందు ‖
Verse
కాంతియు నీవే – నా శాంతియు నీవే
సంతస నీవే – నాకంతయు నీవే‖ 2x ఎల్లవేళలందు ‖