Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Em Chesaanayyaa Neekosam

ఏం చేసానయ్యా నీకోసం

Em Chesaanayyaa Neekosam

Lyricist: Sirivella Hanok
Verse
ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని‖ 2x ‖
ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని‖ 2x ‖
ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించానా నీకై వెలిగించానా‖ 2x ఏం చేసానయ్యా ‖
Verse
ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా‖ 2x ‖
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా
నిన్నే ఎదిరించానా‖ 2x ‖
ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా‖ 2x ‖
నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా‖ 2x ఏం చేసానయ్యా ‖
Verse
ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా‖ 2x ‖
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా‖ 2x ఇప్పటికైనా ‖
Verse
ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా‖ 2x ‖
ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా
సోమరినైపోయానా‖ 2x ఇప్పటికైనా ‖

Related Tags

CommitmentRepentanceEncouragement