Chorus
ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు మరణము ప్రేమజూడరెమనసార
ఆ మహాత్ముఁడు మరణ మగు రీతిఁ గనుకొన్న సామాన్యమగు నొక్క
జనుని చందము గాదు ఈ మహిని గల పాప జీవుల పై మహాకృపఁ
జూపి నిత్య క్షేమ మొసఁగెడు కొరకు బలు శ్రమ చే మృతుండైనాఁడు
స్వేచ్ఛను ఏమాశ్చర్యము‖ ఏమాశ్చర్యము ‖
Verse
కొండవలె భారమై లోక పాపములు దండింపఁబడె ఘోరమై నిండు
భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులునఁ దనువు నిండె
రక్తపుఁ జెమట మెండుకొని దుఃఖములతో నా తండ్రి యీ పాత్రమును
నా కడ నుండి తొలగించుటకు మనపై యుండినను జేయమని వేఁడెను ఏమాశ్చర్యము‖ ఏమాశ్చర్యము ‖
Verse
కడు దుర్మార్గులచేతను క్రీస్తుఁడు పట్టు వడె దానంతట తాను
చెడుగు లెందరు నింద జేసి మోముపై నుమిసి వడిముళ్లతో నల్లఁ
బడిన కిరీటము తడయ కౌదల బెట్టి కరముల నడుగులను సిలువ నిడి
మేకులు దొడిపి ప్రక్కను రక్తజలములు దొరగ గుంతము గ్రుచ్చి రహహా ఏమాశ్చర్యము‖ ఏమాశ్చర్యము ‖
Verse
ఇరు పార్శ్యముల నిద్దరి దొంగల నునిచి మరణావస్థలఁ బెట్టిరి
నిరపరాధి ప్రభువు దురితాత్ము లొనరించు తరుచు బాధల కోర్చి మరి
వారిఁ గరుణించి యెరుఁగ రేమి యొనర్తురో యీ దురిత జీవులు వీరి
నోహో పరమ జనక క్షమించు మని తన యరుల కొరకై వేఁడు కొనియెను ఏమాశ్చర్యము‖ కొనియెను ఏమాశ్చర్యము ‖