Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Emaina Cheyagalavu

ఏమైనా చేయగలవు

Emaina Cheyagalavu

Verse
స్థిరపరచువాడవు బలపరచువాడవు
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు
ఘనపరచువాడవు హెచ్చించువాడవు
మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు‖ 2x ‖
Chorus
ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు
నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు‖ 2x ‖
యేసయ్యా.. యేసయ్యా .. నీకే నీకే సాధ్యము‖ 2x ‖
Verse
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి
నీ చేతిలోనే మా జీవమున్నది‖ 2x ‖
మా దేవా నీ ఆలోచనలన్ని ఎంతో గొప్పవి
మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి‖ 2x ఏమైనా ‖
Verse
నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?
నీ కంచె దాటగ శత్రువుకు సాధ్యమా?‖ 2x ‖
మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును
అపవాది తలచిన కీడులన్ని మేలైపోవును‖ 2x ఏమైనా ‖

Related Tags

PraiseWorshipFaith