Verse
ఏమని పాడను – ఏమని పొగడను‖ 2x ‖
నాదు దేవా – లోకనాథా
నీదు నామం – పాడ తరమా
నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే‖ ఏమని ‖
Verse
నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే
నీవేగా యేసువే‖ 2x ‖
నిన్ను పాడి స్తుతించుట
ఎన్నిక లేని మంటికి భాగ్యమే‖ 2x ‖
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి‖ ఏమని ‖
Verse
జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే
నా ఆశ నీవేగా‖ 2x ‖
దిన దినము నీ ప్రేమ
బాటలో నడువ నాకు నేర్పుము‖ 2x ‖
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి‖ ఏమని ‖