Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Emi Leni Nannu Korukunnaa

ఏమి లేని నన్ను కోరుకున్నా

Emi Leni Nannu Korukunnaa

Lyricist: A R Stevenson
Verse
ఏమి లేని నన్ను కోరుకున్నా
నేను ఉన్న చోటు చేరుకున్నా
పావనుండైన ఆ దేవుడు
ప్రేమతో ఇల జన్మించెను
పాపితో స్నేహం చెయ్యాలని
యేసు క్రీస్తు తానే మానవుడాయెను
దూత దేవ దూత శుభవార్త ప్రకటించె
ధాత శాంతి ధాత ఆగమనం వివరించె
గాలిలో ఎదో కొత్త పాట
సాగెనె హాయి నీయగా
గుండెలో ఉన్న భారమంత
దూరమై సేద తీరగ
సత్యమాయెనే కల
తార వింత తార తూర్పు వైపు కనిపించె
జాడ యేసు జాడ విదితము గావించె
పాకలో ఉన్న తొట్టిలొన
బాలుడు పవళించగా
ధన్యురాలైన తల్లి నోట
స్తోత్రమే పల్లవించగా
వేడుకాయెనే ఇల

Related Tags

JesusChristmasBirth