Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Emivvagalanayya Naa Yesayyaa

ఏమివ్వగలనయ్య నా యేసయ్యా

Emivvagalanayya Naa Yesayyaa

Verse
ఏమివ్వగలనయ్య నా యేసయ్యా
నీవు చేసిన మేలులకై‖ 2x ‖
నిన్ను గూర్చి లోకమంత చాటనా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా‖ 2x ఏమివ్వగలనయ్య ‖
Verse
గురి లేని నా జీవిత పయనంలో
దరి చేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుచున్న నన్ను
శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణించలేను నా యేసయ్యా‖ 2x నిన్ను గూర్చి ‖
Verse
ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ
నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా
నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా
నీ పాత్రగా నన్ను మలచినందుకు‖ 2x నిన్ను గూర్చి ‖

Related Tags

WorshipThanksgiving