Verse
ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు
ఓ పాపి యందు మున్గుము - పాపంబు పోవును
Chorus
యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్తమెప్పుడు - శ్రవించు నాకుగా‖ 2x ‖
Verse
ఆ యూట మున్గి దొంగయు - హా శుధ్ధుడాయెను
నేనట్టి పాపినిప్పుడు - నేనందు మున్గుదున్‖ యేసుండు ‖
Verse
నీ యొక్క పాపమట్టిదే - నిర్మూలమౌటకు
రక్షించు గొర్రెపిల్ల - నీ రక్తము చాలును‖ యేసుండు ‖
Verse
నా నాధు రక్తమందున - నే నమ్మియుండినన్
నా దేవుని నిండు ప్రేమ - నేనందు చూచేదన్‖ యేసుండు ‖
Verse
నా యాయుష్కాలమంతట - నా సంతసంబిదే
నా క్రీస్తుయొక్క రొమ్మునన్ - నా గానమిదియే‖ యేసుండు ‖