Chorus
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా‖ 2x ‖
నీ జనన మెంత దయనీయమో
తలచుకుంటె నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది
Verse
నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా‖ 2x ‖
ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా‖ 2x Emtha ‖
Verse
నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా‖ 2x ‖
దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా‖ 2x Emtha ‖
Verse
చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా‖ 2x ‖
పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా‖ 2x Emtha ‖