Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Emtha Paapinainanu Yaesu Chaerchukonunu

ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును

Emtha Paapinainanu Yaesu Chaerchukonunu

Verse
ఎంత పాపినైనను - యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను - అంతట జాటించుడి
Chorus
హల్లెలూయ - హల్లెలూయ ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనున-టంచు ప్రకటించుడి
Verse
మెండుగా క్షమాపణన్ - పూర్ణ సమాధానము
నెంత పాపికైన దా-నిచ్చి చేర్చుకొనును
Verse
తన దివ్యసిల్వచే - దీసి పాపశాపమున్
నన్ పవిత్రపర్చును - నాకు హాయి నిచ్చెను
Verse
ఘోర పాపినైనను - నన్ను జేర్చుకొనును
పూర్ణశుద్ధి నిచ్చును - స్వర్గమందు చేర్చును

Related Tags

InvitationGospelSalvation