Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enaleni Prema Naapaina Choopi

ఎనలేని ప్రేమ నాపైన చూపి

Enaleni Prema Naapaina Choopi

Lyricist: Aaron Jeshurun
Verse
ఎనలేని ప్రేమ నాపైన చూపి
నీ వారసునిగ చేసినావు‖ 2x ‖
నీ ప్రేమ నేను చాటెదన్
నా సర్వం నీవే యేసయ్యా‖ 2x ‖
Verse
నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా
నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా‖ 2x ‖
నీ కృప చేత రక్షించినావే
నీ ఋణము నే తీర్చగలనా‖ 2x ఎనలేని ‖
Verse
తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై
ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు‖ 2x ‖
కన్నీరు తుడచి నన్నాదరించిన
ఆ జాలి నే మరువగలనా‖ 2x ఎనలేని ‖

Related Tags

PraiseWorshipThanksgiving