Verse
ఎనలేని ప్రేమ నాపైన చూపి
నరునిగా వచ్చిన నా దేవా
నా పాపము కొరకు రక్తమును కార్చి
ప్రాణమునర్పించిన నా దేవా‖ 2x ‖
ఊహించగలనా వర్ణింప తగునా
ఆ గొప్ప సిల్వ త్యాగము‖ 2x ఎనలేని ‖
Verse
కొరడాలతో హింసించినా
మోముపై ఉమ్మి వేసినా‖ 2x ‖
చెమట రక్తముగా మారినా‖ 2x ఊహించగలనా ‖
Verse
ముళ్ల కిరీటముతో మొత్తినా
బల్లెముతో ప్రక్క పొడచినా‖ 2x ‖
పరలోక తండ్రియే చేయి విడచినా‖ 2x ఊహించగలనా ‖