Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enchumu Lekkinchu Meevulan Enchi Choodu Mesu Deevenal

ఎంచుము లెక్కించు మీవులన్ ఎంచి చూడు మేసు దీవెనల్

Enchumu Lekkinchu Meevulan Enchi Choodu Mesu Deevenal

Verse
జీవితంబు ఘోర కష్టనష్టముల్
ఆవరించి నిన్ను దుఃఖపర్చిన
దేవుడిచ్చినట్టి యీవులెంచుము
నీవాశ్చర్యమందెదవు వాటికై
Chorus
ఎంచుము లెక్కించు మీవులన్
ఎంచి, చూడు మేసు దీవెనల్
ఎంచు, మెంచు - మెంచు మీవులన్
వింత నొందెదవు నీవు వాటికై
Verse
చిమ మానసంబు నీకు కల్గినన్
వంతచే భారంబు గల్గు నీయెదన్
సంతసంబుతోడ నెంచు మీవులన్
వింతతో స్మరించు మేసు నామమున్
Verse
నాశనంబు జెందు నాస్తి జూచినన్
వాసిగా శ్రీయేసు నా కొసంగిన
భాసురంపు భాగ్యము దలంపుమా
యీ సుభాగ్యమే కదా సదాయుండు
Verse
జీవితాదియందు ధైర్య మొందుము
దేవుడుండు తన వార్కి తోడుగ
జీవయాత్రయందు సాయమియ్యగన్
దేవదూతల్ నీకు తోడుగా నుండు

Related Tags

EncouragementBlessingGratitude