Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Endhuko Nannu Neevu Ennukunnavu

ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు

Endhuko Nannu Neevu Ennukunnavu

Verse
ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు
ఏ మంచిలేని నన్ను నీవు కోరుకున్నావు
ఆ ప్రేమకు ఫలితము సిలువ త్యాగమా
ఆ ప్రేమకు అర్థం బలి దానమా
Verse
నిన్నేరుగక ఆనాడు దూషించి తిరిగితిని
నీ మహిమను నే కానక అవమాన పరచితిని
నా కరములు నీవు వీడక కాపాడినది
ఈ దీనుని ధన్యునిగా చేయాలనా
Verse
ఘోర వ్యాధితో నేను రోదించిన వేళ్ళలో
దరిరాలేదేవ్వారు నన్నాదరింప గను
ఇలలో దొరకని ప్రేమను చూపించినది
నా స్వామీ నీ సాక్షిగా ఉండాలనా
Verse
నా పాప కాడి క్రింద నలిగిపోతిని
కలువరిలో నా కొరకు కరిగిపోతిని
ఈ పాపిని పరిశుద్దులలో చేర్చాలనా
పరమపురికి నా నావ సాగాలనా

Related Tags

GraceSalvationSacrifice