Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Endina Edaari Brathukulo

ఎండిన ఎడారి బ్రతుకులో

Endina Edaari Brathukulo

Verse
ఎండిన ఎడారి బ్రతుకులో
నిండైన ఆశ నీవేగా
యేసు.. నిండైన ఆశ నీవేగా
తడబడెడు నా పాదములకు
తోడు నీవే గదా
యేసు.. తోడు నీవే సదా‖ ఎండిన ‖
Verse
ఎండమావులు చూచి నేను
అలసి వేసారితి‖ 2x ‖
జీవ జలముల ఊట నీవై
సేద దీర్చితివి
నా బలము నీవైతివే
యేసు.. బలము నీవైతివే
Verse
నిత్య మహిమకు నిలయుడా నీ
దివ్య కాంతిలోన‖ 2x ‖
నీదు ఆత్మతో నన్ను నింపి
ఫలింప జేసితివే
నా సారధి నీవైతివే
యేసు.. సారధి నీవైతివే
Verse
అంధకార లోయలెన్నో
ఎదురు నిలచినను‖ 2x ‖
గాయపడిన నీ హస్తమే నన్ను
గమ్యము చేర్చును
నా శరణు నీవే గదా
యేసు.. శరణు నీవే గదా‖ ఎండిన ‖

Related Tags

PraiseWorshipHope