Chorus
ఎండిన ఎడారి బ్రతుకులో
నిండైన ఆశ నీవెగా యేసు
నిండైన ఆశ నీవెగా
తడబడెడు నా పాదములకు
తోడు నీవె గదా యేసు తోడు నీవె సదా
Verse
ఎండమావులు చూచి నేను అలసివేసారితి
జీవజలముల ఊట నీవై సేదదీర్ఛితివే
నా బలము నీవైతివే యేసూ బలము నీవైతివే
Verse
నిత్య మహిమకు నిలయుడా
నీ దివ్యకాంతిలోనా నీదు ఆత్మతో
నన్ను నింపి ఫలింప జేసితివే
నా సారధి నీవైతివే యేసూ సారధి నీవైతివే
Verse
అంధకార లోయలెన్నో ఎదురు నిలచినను
గాయపడిన నీ హస్తమే నను గమ్యము చేర్చును
నా శరణు నీవే గదా యేసూ శరణు నీవే గదా