Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Endu Ke Chintinchedavu Naa Dendamaa

ఎందు కే చింతించెదవు నా డెందమా

Endu Ke Chintinchedavu Naa Dendamaa

Lyricist: Purushothamu Choudari
Chorus
ఎందు కే చింతించెదవు నా డెందమా నీ కందమా యిందాఁక
రక్షించినవాఁ డిఁకను నిన్ను విడువఁబోడు‖ ఎందుకే ‖
Verse
తొల్లి నీ వొనరించినట్టి దోషమెంతో యరిసి చూడు చెల్లచెదరై పఱచు
తరిని చెయ్యి పట్టినాఁడు అల్లుకొనిన నీ దుర్గణము లణఁగఁ ద్రొక్కి
వేసినాఁడు తల్లడిల్లజేయు నీ శత్రువులఁ దరిమి ప్రోచినాఁడు నల్లగా
దన్నాడా నేఁడు వద్దు సందేహంబులు వీడు‖ ఎందుకే ‖
Verse
తల యెత్తరాని చోటఁ గళ లిచ్చి నిలిపినాఁడు పలుమారు నీ యక్కఱలు
తెలిసి యందిచ్చినాఁడు బలహీన మపుడు నీకు ని ర్భయ మియ్య
వచ్చెడు వాఁడు పలు విధంబు లగు బాధలఁ బారఁ దోలివేసినాఁడు
నెల విప్పుడు లేదన్నాఁడా నీతో నిఁక సరి యన్నాఁడా‖ ఎందుకే ‖
Verse
ఒక్క నీ తల వెండ్రుక యైన నూడిపడ దని చెప్పెడు వాఁడు దిక్కు నీకిక
నేనే యని తన దివ్య వాక్కులఁ దెలిపెడు వాఁడు చిక్కు లను బెట్టెడు
పగవారి చేత నినుఁ జిక్కింపని వాఁడు ఇక్కట్టు మెట్టుల దాఁటించుట
కిదిగో యని చెయి యిచ్చెడు వాఁడు హక్కు లేదన్నాఁడ నేడు అతఁడు
నిను వెలి వేయబో డు‖ ఎందుకే ‖
Verse
యేసు తన రక్తముతో నిన్ను నెంచి ముందే కొనుచున్నాఁడు దోసములు
వెడలించు విమలా త్ముండు నీ సాక్షిగ నున్నాఁడు ఆశతో నీవు గొలిచెడు
తండ్రి యంతటా గాపై యున్నాఁడు నీ సురక్షణ జేయు వారు నినుఁ
జుట్టి యున్నా రెల్లప్పుడు శేషరహితానంద మల్లెదె. చేరువగుచున్నది
చూడుము‖ ఎందుకే ‖

Related Tags

FaithComfortTrust