Chorus
ఎందుఁబోయెదవో హా ప్రభురాయ ఎందుఁబోయెదవో ఎందుఁ
బోయెదవయ్య యీ దుర్మానవశ్రేణి బొందఁదగిన భరంబుఁ బూని రక్షక
నీవు‖ ఎందు ‖
Verse
వడగాలిలోను నీ నెమ్మోము వాడికందఁగను నొడలఁ జెమటయు
నీరు నొడిసివర దయై పార నడుగులు తడఁబడ నయ్యా యిప్పుడు
నీవు‖ ఎందు ‖
Verse
మూఁపుపై సిలువ శత్రు స మూహముల్ నడువఁ కాపు ప్రచండమౌ
కారెండ కాయఁగ నేపున నా పాప మీ పాటు పెట్టఁగ‖ ఎందు ‖
Verse
విరువు గట్టివియో జనుల రక్షించు బిరుదలయ్యవియో పరమ
రక్షకుండా నా పాపబంధము లవియో పరిశోదించెడి వారి
పట్టుకొమ్మలవియో‖ ఎందు ‖
Verse
ఆకాశమందు దూతలు కొల్వ నతితేజ మొందు ప్రాకటమైన నీ
సదముల్ పగులురాల తాఁకునఁబగిలి ర క్త ధారలొల్కఁగను‖ ఎందు ‖
Verse
పరమందుఁగల్గు పరిమళముచేఁ బసమించి వెల్గు చిరమౌ దేహమునకు
నా యెరుష లేమను నట్టి పురములోపలి మన్ను పూత మయ్యెనా
ప్రభువా‖ ఎందు ‖
Verse
ఒక పాలివెతలా రవ్వంతైన సుకరమౌ స్థితులా యకటా చెదరి గుండె
లదరి ఝుల్ ఝుల్మని యొకటిఁ బొందక తాప మొంది కుందునే కర్త‖ ఎందు ‖