Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enduko ee prema nanninthaga preminchenu

ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను

Enduko ee prema nanninthaga preminchenu

Verse
ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను
ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను‖ 2x ‖
ఏ యోగ్యత లేని ఓటి కుండను
నీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి‖ 2x ‖
ఎనలేని కృపనిచ్చితివి‖ ఎందుకో ‖
Verse
నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే
అయినా నీవు క్షమియించినావే
ఊహించని మేలులతో దీవించినావే
నా సంకటములను కదా తీర్చినవే‖ 2x ‖
ఏ యోగ్యత లేని దీనుడను
ఏమివ్వగలను నీ ప్రేమకు
(నా) సర్వం నీకే అర్పింతును‖ 2x ఎందుకో ‖
Verse
మా కొరకు బలి పశువై మరణించినావు
మా పాప శిక్ష తొలగించినావు
పలు విధముల శోధనలో తోడైనావు
ఏ కీడు రాకుండ మేము కాచినావు‖ 2x ‖
రుచి చూపినావు నీ ప్రేమను
ఆ ప్రేమలో నేను జీవింతును
నీవే నాకు ఆధారము‖ 2x ఎందుకో ‖

Related Tags

DevotionalGraceLove