Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enduko Nannintaga Neevu Preminchithivo

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో

Enduko Nannintaga Neevu Preminchithivo

Verse
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
Verse
నాపాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే
Verse
నీ రూపము నాలో నిర్మించి యున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొన్నావు నీ కొరకై నీ కృపలో
Verse
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చేర్చుకొన్నావు నన్ను దాచి యున్నావు
Verse
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సంతసము నీలో
నీవు నేను ఏకమగు వరకు నను విడువనంటివే

Related Tags

PraiseWorshipDevotional