Verse
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
Verse
నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే‖ హల్లెలూయ ‖
Verse
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుచున్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో‖ హల్లెలూయ ‖
Verse
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నాము
నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు‖ హల్లెలూయ ‖
Verse
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీసంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే‖ హల్లెలూయ ‖
Verse
నా మనువులు ముందే నీ మనస్సులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంధంబులో నుండె
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్‖ హల్లెలూయ ‖