Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enduko Nannu Neevu

ఎందుకో నన్ను నీవు

Enduko Nannu Neevu

Verse
ఎందుకో నన్ను నీవు ప్రేమించావు దేవా
ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా
నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదనో దేవా‖ 2x ‖
హల్లెలూయా యెహోవ యీరే – హల్లెలూయా యెహోవ రాఫా
హల్లెలూయా యెహోవ షాలోమ్ – హల్లెలూయా యెహోవ షమ్మా‖ ఎందుకో ‖
Verse
నాకు బదులుగా నాదు శిక్షను నీవు భరియించావు
పాతాళ వేదన శ్రమలనుండి
నన్ను విడిపించావు‖ 2x నీ కృపను ‖
Verse
నే కృంగియున్న వేళలో నీవు కరుణించావు
నా గాయములను బాగు చేయ
నీవు శ్రమనొందావు‖ 2x నీ కృపను ‖
Verse
నీ బండపైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు
పరలోక పరిచర్య భాగస్వామిగా
నన్ను స్వీకరించావు‖ 2x నీ కృపను ‖

Related Tags

WorshipGraceRepentance