Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ennadu Nedaobaya Nae Koladhi Vidana

ఎన్నడు నెడఁబాయ నే కొలది విడనా

Ennadu Nedaobaya Nae Koladhi Vidana

Lyricist: Pulipaka Jagannadhamu
Chorus
ఎన్నడు నెడఁబాయ నే కొలది విడనాఁడ ననిన తండ్రి నిరత
మన్ని బాధలయందు నన్ని దుఃఖములందు నన్ను ఁ బ్రోచు‖ ఎన్నడు ‖
Verse
పాపుల రక్షింపఁ బ్రాణమిచ్చిన యేసు బ్రతికి యుండు తన
ప్రాపు గోరినవారి భారము తా మోసి ప్రాపయి యుండు‖ ఎన్నడు ‖
Verse
ఎల్ల కాలంబుల నేకరీతిగ నుండు యేసునాధుఁ డాతఁ డెల్ల
విశ్వాసుల నెల్ల వేళలఁ దలఁచి యేలుచుండు‖ ఎన్నడు ‖
Verse
తనవారి యక్కఱలు తానెఱిగి యున్నాఁడు తప్పకుండ నాతఁ డెనలేని
దయఁబూని వినువారి మనవులు వేడ్కమీఱ‖ ఎన్నడు ‖

Related Tags

ComfortFaithfulnessGods Love