Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ennallu Ennallu Ee Parugulu

ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ పరుగులు

Ennallu Ennallu Ee Parugulu

Lyricist: Joel Kodali
Verse
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ పరుగులు
ఓ క్షణము తీరికైన లేని ఉరుకులు
ఈ లోక ధనమును అధికార బలమును
ఈ లోక ఘనతలు శరీర సుఖములు
వెతుకుచుంటే దొరుకు నలసటే
Verse
నీ కలలు కోరికలకు అంతమంటూ ఉండదు
నీవెన్ని పోందుకున్నను సంతృప్తి మిగలదు
ఊహించినట్లు సిరులు నీకు సుఖములివ్వవు
ఈ లోక భోగమంతయు నిరాశ మాత్రమే
ఈ లోకమంతయు నీ సొంతమైనను
నీ హృదిలో మాత్రము ఓ లోటు ఉండును
ఆ లోటు యేసుతోనే తీరును
Verse
అనిత్యమైన వాటి వెనుక పరుగు వ్యర్ధము
నిత్యుడైన యేసు వైపు నేడే తిరుగుము
యేసు నిత్య జీవము నీకివ్వవలెనని
సిలువ పైన మరణమొంది తిరిగి లేచెను
యేసు ప్రభువని అంగీకరించితే
పరిశుద్ధాత్ముడు నీ హృదిలో చేరును
ఆ హృదిలో వెలితి ఏల ఉండును

Related Tags

RepentanceSalvationVanity