Chorus
ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా
యేసయ్యను నమ్ముకుంటే ఎన్నెలో ఎన్నెలా
ఆ సామిని కొలుసుకుంటే బతుకంతా ఎన్నెలా
Verse
పరలోకం నుండి దొరా నరలోకం వచ్చిండు
మన సీకటి బతుకుల్లో ఎలుతురే తెచ్చిండు
Verse
సెంతజేరినోళ్ళకంత సింతలన్ని బాపెనంట
ఎంతటి రోగాలైనా సిటికెలో తీసేసెనంట
Verse
సొరగానికి దారిసూప అడుగుబెట్టె భూమిమీద
మరణానికి బుద్దిసెప్ప కన్నుమూసె సిలువమీద
Verse
సక్కనయ్య మోముజూడ సిక్కులన్ని తీరిపోవు
మక్కువతో శరణువేడ బతుకంతా మనలగాయు