Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ennenno Melulatho Nanu Deevinchaavu

ఎన్నెనో మేలులతో నను దీవించావు

Ennenno Melulatho Nanu Deevinchaavu

Lyricist: Sayaram Gattu
Verse
ఎన్నెనో మేలులతో నను దీవించావు
నా జీవితకాలమంత యెరిగి ఉన్నావు
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను
ఎన్ని రీతులుగా కీర్తించగలను
వందనాలు యేసయ్య నీకే
శతకోటి స్తోత్రలయ్యా నీకే‖ 2x ఎన్నెనో మేలులతో ‖
Verse
కష్టాల మార్గములో అలసిన పయణములో
నిందలు మోయలేక కృంగిన సమయములో‖ 2x ‖
సంపూర్ణముగా నాకు పరిశుద్దతనిచ్చావు
సమాధాన కర్తవు నీవై నన్ను ఆదరించావు‖ 2x వందనాలు ‖
Verse
ఏ గమ్యము ఎరుగని నా జీవిత యాత్రలో
అలజడి అలలెన్నో చెలరేగెను నా మదిలో‖ 2x ‖
కలవరమును కరిగించి, కరుణను కురిపించావు
నా భయమును గద్దించి, నీ శాంతితో నింపావు‖ 2x వందనాలు ‖
Verse
కలిగేటి శోధనలు, కనపడని మార్గములు
నీ వాక్యమే దీపముగా, సాగెను నా పాదములు‖ 2x ‖
అపవాదిని నా చేత, ఓడింప జేసావు
వాగ్దాన పూర్ణుడిగా జయ జీవిత మిచ్చావు‖ 2x వందనాలు ‖

Related Tags

PraiseThanksgivingBlessing