Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enni Maarlu

ఎన్ని మార్లు

Enni Maarlu

Lyricist: Kranthi Chepuri
Verse
ఎన్ని మార్లు నీవు దైవ వాక్యమును విని
తిన్ననైన మార్గములో నడువకుందువు?
చిన్ననాటి నుండి నీవు క్రైస్తవుడవని
నులివెచ్చని జీవితమును విడువనందువు?‖ 2x ‖
విశ్వాసీ, ఏది నీ సాక్ష్యము?
దేనిపై ఉన్నది నీ లక్ష్యము?‖ 2x ‖
యేసుపైన లేకుంటే నీ నిరీక్షణ…
ఇంకెందుకు నీకు ఈ రక్షణ? –‖ 2x ఎన్ని మార్లు ‖
Verse
యేసు లేని జీవితం వ్యర్ధమని తెలిసినా
లోకమెప్పు కోసమే వెరచియున్నావా
క్రీస్తు వైపు సాగుతూ వెనుక తట్టు తిరిగితే
ఉప్పు శిలగ మిగిలెదవని మరచిపోయావా‖ 2x ‖
పాపమే వేరు చేసెను
దేవుని నుండి మనలనూ
సిలువ యాగమే దారి చూపెను
ఇకనైనా మార్చుకో నీ మనస్సునూ –‖ 2x విశ్వాసీ ‖
Verse
పాపానికి జీతము మరణమని తెలిసినా
ఇహలోక స్నేహమే పాపమని ఎరుగవా
ఎన్ని మార్లు తప్పినా ఒప్పుకుంటే చాలులే
పరలోకం చేరొచ్చనే భ్రమను విడువవా‖ 2x ‖
చేసిన ప్రతి పాపానికి
తీర్పు దినం ఉంది మరువకు
లేదు నీకు నిత్య జీవము
నీ జీవితం మార్పునొందే వరకు –‖ 2x విశ్వాసీ ‖

Related Tags

FaithRepentanceSalvation