Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enni Maarlu Neevu Daiva Vaakyamunu Vini

ఎన్ని మార్లు నీవు దైవ వాక్యమును విని

Enni Maarlu Neevu Daiva Vaakyamunu Vini

Verse
ఎన్ని మార్లు నీవు దైవ వాక్యమును విని
తిన్ననైన మార్గములో నడువకుందువు?
చిన్ననాటి నుండి నీవు క్రైస్తవుడవని
నులివెచ్చని జీవితమును విడువనందువు?
Chorus
విశ్వాసీ, ఏది నీ సాక్ష్యము?
దేనిపై ఉన్నది నీ లక్ష్యము?‖ 2x ‖
యేసుపైన లేకుంటే నీ నిరీక్షణ…
ఇంకెందుకు నీకు ఈ రక్షణ?‖ 2x ఎన్ని మార్లు ‖
Verse
యేసు లేని జీవితం వ్యర్ధమని తెలిసినా
లోకమెప్పు కోసమే వెరచియున్నావా
క్రీస్తు వైపు సాగుతూ వెనుక తట్టు తిరిగితే
ఉప్పు శిలగ మిగిలెదవని మరచిపోయావా
పాపమే వేరు చేసెను
దేవుని నుండి మనలనూ
సిలువ యాగమే దారి చూపెను
ఇకనైనా మార్చుకో నీ మనస్సునూ‖ విశ్వాసీ ‖
Verse
పాపానికి జీతము మరణమని తెలిసినా
ఇహలోక స్నేహమే పాపమని ఎరుగవా
ఎన్ని మార్లు తప్పినా ఒప్పుకుంటే చాలులే
పరలోకం చేరొచ్చనే భ్రమను వీడవా
చేసిన ప్రతి పాపానికి
తీర్పు దినం ఉంది మరువకు
లేదు నీకు నిత్య జీవము
నీ జీవితం మార్పునొందే వరకు‖ విశ్వాసీ ‖

Related Tags

FaithRepentanceChristian Life