Verse
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా‖ 2x ‖
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా‖ 2x ‖
Verse
నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు‖ 2x ‖
అడవి పూవులే నీ ప్రేమ పొందగా‖ 2x ‖
నా ప్రార్థన ఆలకించుమా‖ 2x ‖
ప్రభువా‖ 2x ఎన్ని ‖
Verse
నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి‖ 2x ‖
ఆరిపోయిన నా వెలుగు దీపము‖ 2x ‖
వెలిగించుము నీ ప్రేమతో‖ 2x ‖
ప్రభువా‖ 2x ఎన్ని ‖
Verse
ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి‖ 2x ‖
లోకమంతయూ నన్ను విడచినా‖ 2x ‖
నీ నుండి వేరు చెయ్యవు‖ 2x ‖
ప్రభువా‖ 2x ఎన్ని ‖
Verse
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి‖ 2x ‖
నీదు యాగమే నా మోక్ష మార్గము‖ 2x ‖
నీయందే నిత్యజీవము‖ 2x ‖
ప్రభువా‖ 2x ఎన్ని ‖